ఆర్‌.ఆర్‌.ఆర్‌: హీరోయిన్ల రేసులో ఈ ముగ్గురూ..!

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి సినిమా అంటే.... ఆ ఆర్భాటం, ఆ సంబ‌రం మామూలుగా ఉండ‌వు. 'బాహుబ‌లి' త‌ర‌వాత వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి - ఆ రేంజు హ‌డావుడి త‌ప్ప‌నిస‌రి. పైగా ఇది మ‌ల్టీస్టార‌ర్ ఆయె. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ ... ఈ కాంబినేష‌న్ చూడ్డానికే కన్నుల పండుగ‌లా ఉంటుంది. అందుకే ఈసినిమాకి సంబంధించిన ప్ర‌తీదీ ఆస‌క్తిక‌ర‌మే.  

ఆదివారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైపోయింది. టైటిల్ ఏంట‌న్న‌ది ఇంకా తేల‌లేదు. హీరోయిన్లూ ఇంకా ఖ‌రారు కాలేదు. కానీ ఈ సినిమాకి 'రామ రావ‌ణ రాజ్యం' అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు భోగ‌ట్టా. ఇప్పుడు క‌థానాయిక‌ల లిస్టు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌ల‌కు చాన్సుంది. వాళ్లెవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌లేదు. అయితే కొంత‌మంది పేర్లు ప్ర‌స్తుతానికి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 

మ‌హాన‌టితో వారెవా అనిపించుకున్న కీర్తి సురేష్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.  ఛ‌లో, గీతా గోవిందం సినిమాల‌తో స్టారైపోయిన ర‌ష్మిక‌నీ తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ట‌.  ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తున్న కైరా అడ్వానీ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌. ప్ర‌స్తుతానికి ఈ ముగ్గురి పేర్లూ గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. వాటిలో రాజ‌మౌళి ఎవ‌రికి టిక్ పెడ‌తాడో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS