'నేను శైలజ' సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తొలి అడుగుతోనే మంచి విజయం అందుకోవడంతో పాటు, నటనలోనూ మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్‌కి కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకోవడంలో పలు నెగిటివ్ కామెంట్స్ తలెత్తుతున్నాయిప్పుడు.
అంత గొప్ప నటి సావిత్రి పాత్రకు న్యూ కమ్మర్‌ని ఎలా సెలెక్ట్ చేశారంటూ సీనియర్ నటులు వాపోతున్నారు. నిజమే కీర్తిసురేష్ ఇంతవరకూ అన్ని యాంగిల్స్‌లోనూ నటిగా ప్రూవ్ చేసుకున్నది పెద్దగా లేదు. అయితే ఆమె ఫేస్ ఫీచర్స్ ఇప్పటిదాకా కీర్తి నటించిన సినిమాలు విజయవంతమవడం చూసి ఆ పాత్రకి ఆమెను ఎంపిక చేసుకొని వుండవచ్చును. కానీ తాజాగా అలనాటి నటి జమున సావిత్రి పాత్రకు నటనలో అనుభవం లేని కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవడం కరెక్ట్ కాదనీ అభిప్రాయపడ్డారు. దాంతో చిత్ర యూనిట్ ఆందోళనలో పడింది. మరో పక్క ఈ విషయంపై కీర్తిసురేష్ స్పందించింది.
అన్ని రకాలా ఆలోచించే, తాను ఈ పాత్రలో సావిత్రి స్థాయిలో నటించి మెప్పించగలననే నమ్మకంతోనే ఒప్పుకున్నానని కీర్తి సురేష్ చెప్పింది. కానీ సినిమా విడుదలయితే కానీ తెలీదు కీర్తి సురేష్ ఎంతగా మెప్పించగలదో. తొలుత ఈ పాత్ర కోసం సమంతను అనుకున్నారు. నటనలో సమంత అనుభవం ఉన్న నటి. కళ్లతోనే అన్ని భావాలు పలికించగలదు. అలాంటిది సమంతను పక్కన పెట్టి కీర్తిని ఎంపిక చేసుకోవడంలో అంతరార్ధం ఏమిటో చిత్ర యూనిట్‌కే తెలియాలి.
ఈ నేపథ్యంలో విడుదలయ్యాక ఏమాత్రం బ్యాడ్ టాక్ వచ్చినా కీర్తి సురేష్‌పెనేౖ ఆ ప్రభావం పడుతుంది. దాంతో ఆ పాత్రని మరింత సమర్ధవంతంగా పోషించాల్సిన అతి పెద్ద బాధ్యత కీర్తిసురేష్‌పై పడిందని చెప్పవచ్చు.