'మహానటి' సినిమాతో కీర్తిసురేష్ సాధించిన సక్సెస్ అంతా ఇంతా కాదు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు కొల్లగొట్టి, విజయం పతాకం ఎగురవేసింది. వందలమందితో ప్రశంసించుకుంటోంది. ఈ సందర్భంగా కీర్తిసురేష్‌లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్‌కి భారీ అండ్ క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే ఇంతవరకూ మరో కొత్త సినిమాకి కీర్తి ఓకే చేయలేదు. కానీ, తమిళంలో ఆల్రెడీ రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి సూర్య - సెల్వ రాఘవన్ సినిమా కాగా, మరోటి విక్రమ్ సరసన నటిస్తున్న 'సామి 2' చిత్రం. ఓ వైపు తమిళ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు 'మహానటి' సక్సెస్ మీట్స్‌లోనూ జోరుగా పాల్గొంటోన్న కీర్తి సురేష్ తన లైఫ్‌కి సంబంధించి కొన్ని ఆశక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకోవడం ద్వారా అభిమానుల్లో మరింత క్రేజ్ సంపాదించేస్తోంది.
కెరీర్ తొలి దశలో ఉన్న ముద్దుగుమ్మల్ని పెళ్లి విషయం అడిగితే, అప్పుడేనా? పెళ్లా? దానికి ఇంకా చాలా టైముంది.. అని తప్పించేసుకుంటారు. కానీ కీర్తి అలా కాదు, ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదు కానీ, త్వరలోనే చేసుకుంటానని చెప్పింది కీర్తి. అలాగే లవ్ మ్యారేజా? అరేంజ్‌డ్ మ్యారేజా? అని అడిగితే, దానికి కూడా క్లారిటీ ఇచ్చింది.
లవ్ చేసినా తనకేం ప్రాబ్లం లేదనీ, వాళ్ల పేరెంట్స్‌ది లవ్ మ్యారేజ్ కాబట్టి, తను ప్రేమిస్తే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరాలేమీ ఉండవని కూడా చెప్పింది. అయితే ప్రస్తుతం కీర్తి మనసులో ఎవరైనా ఉన్నారా? అంటే అది మాత్రం నో అనేసింది.