వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తెలుగు హీరోలలో శర్వానంద్ ఒకడు. ఈయన తాజాగా ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ ఇచ్చాడు.
అదేమనగా- నిర్మాతగా మారి కో అంటే కోటి అనే సినిమా తీయడమే, సినీ కెరీర్ మొత్తంలో తాను చేసిన ఏకైక పెద్ద తప్పు అని పేర్కొన్నాడు. ఆ సినిమా కోసం తాను అప్పటివరకు సినిమాలలో సంపాదించినదంతా పెట్టేశాను అని అయితే ఆ చిత్రం తనకి నష్టాలని మిగిలిచింది అని చెప్పుకొచ్చాడు.
దాదాపు మూడేళ్ళ పాటు ఆ ఇబ్బందులు పడ్డాను అని, అందుకే భవిష్యత్తులో అటువంటి పని ఏమి చేయను అని తేల్చి చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవాపుడి దర్శకత్వంలో పడి పడి లేచెను మనసు చిత్రంలో నటిస్తున్నాడు, ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నది.
ఈ పైన విషయం చదివాక, నిర్మాతగా మారి సినిమా తీయడం అనేది అంత సలువు కాదు అని మాత్రం అందరికీ తెలుస్తుంది.