సినీ రంగంలో గ్లామర్‌కి ఉన్న ఇంపార్టెన్స్‌ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ప్రస్తుతం కొంతమంది ముద్దుగుమ్మలు ఈ విషయంలో తాము సెపరేట్ అంటూనే, క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. వారిలో ముందు వరసలో నిలిచేది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయే అయినా కానీ ఈ బ్యూటీ మొదట్నుంచీ ఒకే మాట చెబుతోంది.
ఎక్స్‌పోజింగ్‌కి నేను దూరం అని కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో కీర్తిసురేష్ ఆటిట్యూడ్‌ని మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఎక్స్‌పోజింగ్‌కి నో చెబితే, అవకాశాలు అంతగా రావనే బలమైన నమ్మకం సినీ పరిశ్రమలో ఉంది. కానీ ఈ బ్యూటీ విషయంలో అది కాస్తా రివర్స్ అయ్యి కూర్చుంది. నో ఎక్స్‌పోజింగ్ అన్నా కూడా ఆఫర్స్ మాత్రం వెల్లువెత్తుతున్నాయి. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ వెల్లువలా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అవి కూడా పెద్ద పెద్ద సినిమాల్లో కావడమే ఆశ్చర్యకరం.
తమిళంలో ఆల్రెడీ, స్టార్ హీరోస్ అయిన విజయ్ తదితర అగ్ర హీరోల సరసన ఇప్పటికే నటించేసింది ఈ బ్యూటీ. తాజాగా సూర్యతో నటిస్తున్న సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. 'గ్యాంగ్' టైటిల్‌తో ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. విజయ్‌తో మరో సినిమాలో నటిస్తోంది. తమిళంలో మరో ప్రముఖ హీరో అయిన విశాల్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. విక్రమ్ హీరోగా వస్తున్న 'సామి 2'లోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. ఇకపోతే తెలుగు విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటిస్తోంది. సంక్రాంతికి 'అజ్ఞాతవాసి' విడుదల కానుంది.
ఇలా కీర్తి సురేష్ ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ స్టార్ హీరోల పక్కన క్రేజీ క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తూ, అనూహ్యంగా స్టార్ హీరోయిన్ ప్లేస్‌లోకి వచ్చేసింది.