సినిమా క్రిటిక్ గా పేరు తెచుకున్న మహేష్ కత్తి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులతో వివాదం కారణంగా ఆయనకీ చిన్నపాటి సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది.
అయితే కొద్దిసేపటి క్రితం ఆయన తన పైన సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులని అల్లు అరవింద్ అధీనంలో నడిచే గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ఆఫీస్ లో జరుగుతున్నాయని, దానికి సంబంధించి తన వద్ద పక్కా సమాచారం ఉంది అని తెలిపాడు.అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంబంధించి తన ఫోన్ నంబర్ వారికి చేరవేసిన క్రమంలో గీతా ఆర్ట్స్ ఆఫీస్ హస్తం కూడా ఉంది అంటూ ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వెంటనే ఈ విషయానికి సంబంధించి ఎవరు ఇలాంటి అక్రమాలకి పాల్పడుతున్నారో తెలుసుకుని వారిని కట్టడి చేయమని అల్లు అరవింద్ ని ఈ సందర్భంగా కోరాడు. లేకపోతే తాను కచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలిపాడు.
మహేష్ కత్తి - పవన్ అభిమానుల గొడవ ఇప్పుడు గీతా ఆర్ట్స్ వైపు తిరగడం ఈ మొత్తం అంశంలో కొసమెరుపు. మరి ఈ అంశం పై గీతా ఆర్ట్స్ కాని, అల్లు అరవింద్ కాని ఇంకా స్పందించలేదు.