ఆ ఛాన్స్‌ కీర్తికి టెన్షన్‌ పుట్టిస్తోందా?

By iQlikMovies - July 29, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత మంచి గుర్తింపు దక్కించుకున్నామన్నదే లెక్క అంటోంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. తెలుగులో 'నేను శైలజ' సినిమాతో ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన కీర్తి సురేష్‌. తొలి సినిమాకే యాక్టింగ్‌ పరంగా మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు, యంగ్‌ హీరో రామ్‌కి సూపర్‌ హిట్‌ ఇచ్చి, లక్కీ బ్యూటీ అయిపోయింది. తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తుండగా, అనుకోకుండా తగిలిన ప్రాజెక్ట్‌ 'మహానటి' ఆమె కెరీర్‌ని మార్చేసింది. స్టార్‌ హీరోయిన్‌ని చేసేసింది.

 

విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది ఈ సినిమా. 'మహానటి' తెచ్చిన గుర్తింపుతో తెలుగు, తమిళ భాషల్లో కీర్తి పతాకం ఎగరేస్తోంది. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా తనలోని కొత్త టాలెంట్‌కి ఎప్పటికప్పుడే పదును పెడుతోంది. యంగ్‌ హీరోస్‌కే కాదు, సీనియర్‌ హీరోస్‌కీ జోడీగా నటిస్తోంది. ఆల్రెడీ తమిళంలో విశాల్‌, విక్రమ్‌, విజయ్‌, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో జోడీ కట్టిన కీర్తిసురేష్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అజయ్‌దేవగణ్‌ నటిస్తున్న సినిమాలో కీర్తి సురేష్‌ ఛాన్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్‌ అందుకుంటానా? అని కీర్తి సురేష్‌లో అప్పుడే టెన్షన్‌ మొదలైందట.

 

కీర్తిలో అంత టెన్షన్‌ పుట్టడానికి కారణం కూడా లేకపోలేదు. సౌత్‌లో స్టార్‌డమ్‌ సంపాదించుకున్న రకుల్‌ వంటి వారు బాలీవుడ్‌లోకెళ్లాక ఎలాంటి రిజల్ట్స్‌ చూడాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. అదే టెన్షన్‌ కీర్తిలోనూ మొదలైందట. ఆ టెన్షన్‌తోనే, కీర్తి ఫిజిక్‌పై ఫోకస్‌ పెట్టింది. కష్టపడి స్లిమ్‌ అండ్‌ స్లీకీగా మారిపోయింది. మరి కీర్తి టెన్షన్‌ తీరాలంటే ఇంకాస్త సమయం వెయిట్‌ చేయక తప్పదు. మరోవైపు త్వరలో కీర్తిసురేష్‌ తెలుగులో 'మన్మధుడు 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిడివి తక్కువే అయినా, ఈ సినిమాలో తన పాత్ర అందరికీ గుర్తుండిపోతుందంటోంది కీర్తి సురేష్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS