స్టైల్‌ కా బాప్‌: దటీజ్‌ 'మన్మధుడు'.

మరిన్ని వార్తలు

ఇకపోతే, వీకెండ్‌లో నాగార్జున హ్యాండ్‌సమ్‌ అప్పియరెన్స్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించింది. స్టైల్‌ కా బాప్‌ నాగార్జున బిగ్‌బాస్‌ కోసం డిజైన్‌ చేయించుకుంటున్న కాస్ట్యూమ్స్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. ఇంతవరకూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ అంటే సూట్స్‌, కోట్లు, బ్లేజర్స్‌ మాత్రమే ధరిస్తారేమో అనుకున్నారంతా. కానీ, నాగ్‌ ఆ సాంప్రదాయాన్ని మార్చేశాడు తన డ్రస్సింగ్‌ స్టైల్‌తో, ఎంతైనా 'సోగ్గాడు' కదా.

 

ఆ సోగ్గాడికి ఏది వేసినా సూపర్బ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌ ఫార్మేట్‌లో కాకుండా, డిఫరెంట్‌ స్టైల్‌లో కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయించుకుంటూ, బిగ్‌బాస్‌ సెట్‌కే కొత్త అందాన్ని తీసుకొచ్చాడు. ఆయనతో పాటు, వీకెండ్స్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ కూడా సరికొత్తగా రెడీ అవుతూ, మన్మధుడి కాంప్లిమెంట్స్‌ కొట్టేస్తున్నారు. మన్మధుడితో పొగిడించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందుకే ఎవ్వర్నీ డిజప్పాయింట్‌ చేయకుండా, హౌస్‌ మేట్స్‌ అందరికీ డ్రస్సింగ్‌లో బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నాడు మన బిగ్‌బాస్‌ మన్మధుడు.

 

బిగ్‌బాస్‌తో పాటు, ఇకపై నాగార్జునకు మరో పెద్ద బాధ్యత ఉండనే ఉంది. ఆగస్ట్‌ 9న ఆయన నటించిన 'మన్మధుడు 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి జోరుగా ప్రమోషన్స్‌ చేయాలనుకుంటున్నాడట నాగార్జున. సో త్వరలోనే 'మన్మధుడు 2' ప్రమోషన్స్‌కి రంగం సిద్ధం చేస్తోందట 'మన్మధుడు 2' టీమ్‌. ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా రకుల్‌ ప్రీత్‌ నటిస్తోంది. కీర్తిసురేష్‌, సమంత గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నారు. 'చిలసౌ' ఫేమ్‌ రాహుల్‌ రవీంద్ర ఈ సినిమాకి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS