పవన్‌తో సినిమా: డైలమాలో కీర్తిసురేష్‌.?

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ ` కీర్తి సురేష్‌ జంట ఆల్రెడీ ‘అజ్ఞాతవాసి’లో కనువిందు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ జంట రిపీట్‌ అవ్వనుందా.? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. క్రిష్‌ ` పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకి కీర్తి సురేష్‌ దాదాపు హీరోయిన్‌గా కన్‌ఫామ్‌ అయ్యిందని తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమా కోసం బాలీవుడ్‌ భామని అనుకున్నారు. కానీ, పీరియాడికల్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి కీర్తిసురేష్‌ న్యాయం చేయగలదని భావిస్తున్నాడట క్రిష్‌. సో ఆల్రెడీ కీర్తితో సంప్రదింపు కూడా జరిగాయట.

 

పవన్‌తో సినిమాకి కీర్తి ఎందుకు కాదంటుంది.? అయితే, ప్రస్తుతం కీర్తి సురేష్‌ చాలా బిజీ. దాదాపు ఐదారు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. అందులో రెండు, మూడు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ ప్రాజెక్టులే. దాంతో పవన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉన్నా, డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకోవడంలో కీర్తి కిందా మీదా పడుతోందట. అయితే, క్రిష్‌ చాలా తొందరగా సినిమా కంప్లీట్‌ చేసేస్తాడు. అందులోనూ పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇటు రాజకీయాల్నీ, అటు సినిమాల్నీ రెండిరటినీ ఎట్‌ ఏ టైమ్‌ బ్యాలెన్స్‌ చేయాలి. కాబట్టి, డేట్స్‌ అడ్జస్ట్‌మెంట్‌లో కీర్తికి పెద్దగా ప్రాబ్లెమ్‌ రాకపోవచ్చు. కోరి వచ్చిన అవకాశం, అందులోనూ పవన్‌తో రెండోసారి నటించే ఛాన్స్‌.. వదులుకునే ప్రశక్తే లేదు కానీ, చూడాలి మరి కీర్తి సురేష్‌ సురేష్‌ ఎలా మ్యానేజ్‌ చేస్తుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS