RRR లో మరో ప్రత్యేకత చేరింది. ఈ చిత్రంలో జాతీయ ఉత్తమ నటుడు మోహన్ లాల్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం అందుతోంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే... RRR షూటింగ్ మొదలవుతుందని, ఈసారి షెడ్యూల్ లో మోహన్ లాల్ కూడా పాలు పంచుకుంటారని తెలుస్తోంది. ఇందులో మోహన్ లాల్ ఎన్టీఆర్‌కి బాబాయ్ గా కనిపిస్తారట. ఇది వరకు జనతా గ్యారేజ్‌లోనూ ఎన్టీఆర్ - మోహన్ లాల్ కాంబినేషన్ చూశాం.
ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతోందన్నమాట. ఈ పాత్ర కోసం మోహన్ లాల్ కి భారీ పారితోషికం ముట్టజెబుతున్నారని టాక్. తెలుగు, తమిళ, కన్నడ, మయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. మలయాళ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి మోహన్ లాల్‌ని ఎంచుకున్నారని సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.