ఈమధ్య హీరోలు అదనపు ఆదాయ మార్గాల కోసం బాగానే అన్వేషిస్తున్నారు. ప్రొడక్షన్, డిస్టిబ్యూషన్ రంగాల్లోనూ అడుగుపెట్టి డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. శర్వానంద్‌కి ఈ రెండింటిలోనూ అనుభవం ఉంది. అయితే కొంతకాలంగా... కేవలం నటనపైనే దృష్టి నిలిపాడు. ఇప్పుడు మాత్రం ఓ సినిమాని కొనేశాడు. ఆ సినిమానే... `కేశవ`. నిఖిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. సుధీర్ వర్మ దర్శకుడు. ఈనెల 19న విడుదల కాబోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రైట్స్‌ని శర్వానంద్ కొనుకోలు చేసినట్టు సమాచారం. దాదాపు రూ.4 కోట్లకు ఈ సినిమాని కొన్నాడట. ఆడియో ఫంక్షన్‌కి శర్వా రావడానికి, ఈ చిత్రబృందాన్ని ఆకాశానికి ఎత్తేయడానికి ఇదే కారణమని తెలుస్తోంది. రాధ సినిమా ఫ్లాప్‌తో కాస్త నిరాశలో ఉన్న శర్వాకి... కేశవ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.