గ్లామ్‌షాట్‌: సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌!

మరిన్ని వార్తలు

అదేదో సినిమాలో సీరియస్‌గా డాన్సేసేస్తూ బోర్‌ కొట్టి మధ్యలో బీటు మార్చండెహే.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్‌ మార్చమ్మా.. అంటున్నారు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మని. అవును మరి భారీ అందాల ముద్దుగుమ్మ కేతికా శర్మ.. ఎప్పటికప్పుడే కొత్త కొత్త హాట్‌ ఫోటోలు పోస్ట్‌ చేస్తుంది కానీ, ఒక్కటే ఎక్స్‌ప్రెషన్‌తో విసుగు తెప్పిస్తోంది. ఇంచుమించు ఒకే తరహా కాస్ట్యూమ్స్‌ని ఇష్టపడుతుంది ఈ బ్యూటీ. పిక్కలు కనిపించేలా షార్ట్‌ జీన్సూ, ఎద ఎత్తులు ఉప్పొంగేలా స్లీవ్‌లెస్‌ టాపులూ.. ఇవే ఎక్కువగా వాడే ఈ ముద్దుగుమ్మ ఏ కాస్ట్యూమ్‌కైనా ఒకటే ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తుంటుంది.

 

ఫేస్‌లో క్యూట్‌నెస్‌, బాడీలో హాట్‌నెస్‌ రెండూ పోటీ పడుతుంటాయి. పూరీ జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ నటిస్తున్న 'రొమాంటిక్‌' సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. పరిచయానికి ముందే ఇదిగో ఇలా సోషల్‌ మీడియా ద్వారా బాగా పాపులర్‌ అయిపోయింది. ఆల్రెడీ నెట్టింట్లో అమ్మడికి ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఉంది ఎప్పటి నుండో. ఇప్పుడు 'రొమాంటిక్‌' మూవీ ఆ క్రేజ్‌కి మరింత ప్లస్‌ కానుంది. త్వరలోనే 'రొమాంటిక్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS