గ్లామ్‌షాట్‌: 'రొమాంటిక్‌'గా చింపేసింది.!

మరిన్ని వార్తలు

పరిచయానికి ముందే ఓ రేంజ్‌లో తనను తాను ప్రమోట్‌ చేసుకుంటోన్న ముద్దుగుమ్మ కేతికా శర్మ. పూరీ జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కుతోన్న 'రొమాంటిక్‌' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది ఈ ముద్దుగుమ్మ.

 

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఈ సినిమా. అయితే గ్లామర్‌ పాళ్లు కాస్త ఎక్కువే ఉన్న ఈ అందాల భామ తనలోని రొమాంటిక్‌ యాంగిల్స్‌ని ముందే కొంచెం, కొంచెంగా కాదేమోలెండి, కాస్త ఎక్కువగానే చూపించేస్తోంది. సినిమా వరకూ కాస్త దాచుకోవమ్మా చక్కనమ్మా అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నా, అమ్మడి అందాల ధాటికి ఆల్రెడీ కుర్రకారు మనసులు పారేసుకుంటున్నారు. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ అందంలోనే కాదండోయ్‌.

 

మంచి డాన్సర్‌ అట కూడా. ఆ టాలెంట్‌ చూడాలంటే మాత్రం సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS