'మెగా' పొలిటికల్‌ గ్లామర్‌ - ఫ్యాన్స్‌కి పండగే పండగ.!

మరిన్ని వార్తలు

జనసేన పార్టీ నుండి మెగా బ్రదర్‌ నాగబాబు ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం నుండి నాగబాబు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగబాబు ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం తనతో పాటు, తన ఫ్యామిలీని కూడా రంగంలోకి దించుతానని నాగబాబు చెప్పారు.

 

నాగబాబు నేటివ్‌ ప్లేస్‌ మొగల్తూరు. ఆయన భార్య వెస్ట్‌ గోదావరి.. సో ఆయా ప్రాంతాలతో నాగబాబు కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. చుట్టాలు, స్నేహితులు అంతా అక్కడే ఉన్నారు. అయితే సినిమాల పరంగా హైద్రాబాద్‌లో సెటిలైన కారణంగా పిల్లలకు మాత్రం ఆ వాతావరణం అంతగా తెలియదు. కానీ ఎన్నికల నిమిత్తం తన పిల్లలు వరుణ్‌ బాబునీ, నిహారికను కూడా ప్రచారానికి తీసుకొస్తానని నాగబాబు తెలిపారు. కనీసం ఒక్కరోజైనా వరుణ్‌తేజ్‌, నిహారిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని నాగబాబు మాటల ద్వారా తెలుస్తోంది. వరుణ్‌, నిహారికల సంగతి సరే, మరి ఇద్దరు బాబాయ్‌ల కోసం అబ్బాయి రామ్‌చరణ్‌ ప్రచారానికొస్తాడా.?

 

అంటే అది మాత్రం పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని మెగా బ్రదర్‌ నాగబాబు చెప్పడం కొసమెరుపు. ఏది ఏమైనా వెస్ట్‌ గోదావరిలో మెగా పొలిటికల్‌ గ్లామర్‌తో ఫ్యాన్స్‌ పండగ చేసుకోవడం ఖాయం ఈ ఎలక్షన్‌ సీజన్‌లో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS