‘రొమాంటిక్‌’ ఐడియా: ఫిట్‌నెస్‌ కోసం బాక్సింగ్‌

By Inkmantra - February 13, 2020 - 18:03 PM IST

మరిన్ని వార్తలు

వావ్‌.. వాట్‌ యాన్ ఐడియా సర్‌జీ.. అనాల్సిందే ఆ వీడియో చూస్తే. అందాల ఆరబోతలతో సోషల్‌ మీడియాని షేక్‌ చేసే ముద్దుగుమ్మ కేతికా శర్మ తాజాగా రెండు రొమాంటిక్‌ వీడియోల్ని పోస్ట్‌ చేసింది తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా. ఈ వీడియోల్లో పాప పాపం తెగ కష్టపడిపోతూ బాక్సింగ్‌ చేసేస్తోంది. ఇంతకీ ఈ బాక్సింగ్‌ ఎందుకంటారా.? ఫిట్‌నెస్‌ కోసమట. ఇలా బాక్సింగ్‌ చేస్తే ఖచ్చితంగా ఫిట్‌గా ఉంటారని చెబుతోంది. ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో రకరకా కసరత్తు చేస్తుంటారు ముద్దుగుమ్ములు.

అయితే, ఈ హాటీకి వచ్చినట్లుగా బాక్సింగ్‌ థాట్స్‌ కాస్త భిన్నమైనవేనని అనుకోవాలేమో. అన్నట్లు.. బాక్సింగ్ చేస్తూ.. ఆ వీడియోల్సిన హాట్ హాట్ గా సోషల్ మీడియాలో చాలామంది అందాల భామలు ఇప్పటికే పోస్ట్ చేసేసి.. ఆ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసేసుకున్న సందర్భాలున్నాయి. ఇక, కేతిక విషయానికొస్తే, ఇలాక్కూడా చేస్తారా.? అని నెటిజన్లు పాపపై హాట్‌ హాట్‌ సెటైర్లు వేస్తున్నారు. సెటైర్లు వేస్తేనేమి.. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో కలిసి కేతికా చేస్తున్న ఈ హాట్‌ హాట్‌ బాక్సింగ్‌ కసరత్తుకు మంచి రెస్పాన్సే వస్తోందనుకోండి. ఇలా చేయడం వల్లేనేమో.. బొద్దుగా కనిపించే ఈ భామ కాస్త సన్నబడ్డట్లే కనిపిస్తోంది. నిజంగానే ఇది రొమాంటిక్‌ ఐడియా సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS