మెగాస్టార్‌ 152 లో మోహన్‌బాబు: క్లారిటీ ఇచ్చేశారు!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంలో మోహన్‌బాబు నటిస్తున్నారట.. అనే వార్త ఈ మధ్య టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇటు మంచు ఫ్యాన్స్‌, అటు మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కానీ, ఆ ముచ్చట ఎన్నాళ్లో నిలవలేదు. ఈ న్యూస్‌పై చిత్ర యూనిట్‌ తాజాగా స్పందించింది. మోహన్‌బాబు గొప్ప నటులు. ఆయనకు తగ్గ పాత్ర మా సినిమాలో లేదు.. అంటూ గౌరవప్రదంగా చెప్పేశారు. దాంతో చిరు, మోహన్‌బాబు కాంబో రూమర్‌కి చెక్‌ పడిపోయినట్లే.

 

ఇకపోతే, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న మరో గాసిప్‌ కూడా వినిపిస్తోంది. నక్సలైట్‌ పాత్రలో చరణ్‌ కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరి అది కూడా జస్ట్‌ గాసిప్పేనా? లేక నిజమా? అని తెలియాలంటే, ఇలాగే త్వరలో చిత్ర యూనిట్‌ నుండి క్లారిటీ రావల్సి ఉంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

 

త్వరలోనే త్రిష్‌ షూటింగ్‌లో పాల్గొననుందని తెలుస్తోంది. మరో హాట్ బ్యూటీ రెజీనా ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తుందని ప్రచారం ఉంది. ఆల్రెడీ ఈ సాంగ్‌ షూటింగ్‌ కూడా జరిగిందని టాక్‌. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS