సోషల్ మీడియా సెన్సేషన్ కేతికా శర్మ తాజాగా హోలీ పండగను పురస్కరించుకుని గ్లామర్ లుక్స్‌లో దర్శనమిచ్చింది. ఎప్పటిలాగే తన క్లీవేజ్ సొగసుల్ని ఎగ్జిబిషన్‌కి పెట్టింది. అయితే, ఈ సారి కాస్త స్పెషల్. రంగులతో తన అందాల్ని నింపేసింది. చిరు చిరు రంగులు అద్ది, అందాలకు కొత్త వన్నెలు దిద్దింది. ఫేస్‌లో ఓ ‘రొమాంటిక్’ ఎక్స్ప్రెషన్ ఇచ్చి తన గ్లామర్‌కి ఫుల్‌గా సెక్సప్పీల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ భామ ‘రొమాంటిక్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కేతిక థై సొగసులే, స్పెషల్ ప్రమోషన్స్‌గా నిలిచాయి. ప్రమోషన్స్‌లో భాగంగా కేతిక అందాల వాడకం మామూలుగా లేదు. ఇంతవరకూ రిలీజైన పోస్టర్స్ అన్నింట్లోనూ కేతిక కాక పుట్టించేస్తోంది. మరి, సినిమాతో ఎలాంటి హీటు జనరేట్ చేస్తుందో చూడాలిక. పూరీ జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.