సోషల్ మీడియా సెన్సేషన్ కేతికా శర్మ ప్రస్తుతం ‘రొమాంటిక్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉండగానే, మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట ఈ ఢిల్లీ భామ. ఈ సారి నాగశౌర్యతో జత కట్టబోతోందట. సుకుమార్ రైటింగ్స్, శరత్ మరార్ కాంబినేషన్‌లో ఓ సినిమా నిర్మితమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కాశీ విశాల్ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా కేతిక పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
అయితే, ఇంకా ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. కానీ, దాదాపు కేతికా పేరు ఓకే అయ్యిందనీ తెలుస్తోంది. ఒక సినిమా రిలీజ్ కాకుండానే, మరో సినిమా కోసం కేతిక పేరు వినిపిస్తోందంటే, ఈ ఢిల్లీ భామ లక్ మామూలుగా లేదనుకోవాలి. పాప హాట్‌నెస్ బాగానే టెంప్ట్ చేసిందనుకోవాలి. ఇటీవలే నాగశౌర్య ‘అశ్వథ్థామ’ సినిమాతో హిట్ కొట్టి ఉన్నాడు. ఇక ఇప్పుడు.. సుకుమార్ రైటింగ్స్‌లో రాబోయే సినిమా అంటే ఉండాల్సిన కొన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి. ఇంకేముంది. ఇదే జోరు కొనసాగితే, కేతికకు టాలీవుడ్‌లో తిరుగే లేదనిపిస్తోంది . కానీ, చూడాలి మరి.