‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. హీరోయిన్‌గా ఉండాల్సిన అన్ని బెస్ట్ క్వాలిటీస్ పుష్కంగా ఉన్న ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్‌లో ఆఫర్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు. కానీ, బాలీవుడ్‌లో ఒకటీ అరా ఛాన్సెస్‌తోనూ, చేతి నిండా వెబ్ సిరీస్‌తోనూ బిజీగానే ఉందనుకోండి. అయితే, అది చాలదు కదా. స్టార్‌డమ్ దక్కించుకోవాలంటే, ఆ స్టెప్ మరోలా ఉండాలి. అందుకే ఈ మధ్య శ్రద్ధా చేస్తున్న గ్లామర్ హంగామా అంతా ఇంతా కాదు, సోషల్ మీడియాలో వీర లెవల్‌లో గ్లామర్ తడాఖా చూపిస్తోంది. శ్రద్ధాదాస్ గ్లామర్ చూసి, మన తెలుగు ఫిలిం మేకర్స్ రియలైజ్ అయ్యారట.
ఇంతటి గ్లామర్‌నా మనం వదులుకున్నది.. అని ఫీలయ్యారో ఏమో, ఓ బెస్ట్ ఆఫర్ శ్రద్ధాకి కట్టబెట్టే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఓ ప్రముఖ దర్శకుడు శ్రద్ధాదాస్‌పై దృష్టి పెట్టాడట. ఆమెను లీడ్ రోల్‌లో పెట్టి, ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడట. అందుకు మరో ప్రముఖ నిర్మాత కూడా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఎక్స్ 100’ రేంజ్‌లో ఆ సినిమాని తెరకెక్కించి ఫుల్‌గా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, శ్రద్ధాదాస్ బ్రేక్ ఈవెన్ అయినట్లే. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో శ్రద్ధాదాస్ నటిస్తోంది.