తమిళ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కుల్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, డ్రీమ్ వారియర్ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని హిందీలోనూ తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించే హీరో ఎవరనే అంశంపై బాలీవుడ్లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోందట. స్టార్ హీరోతోనే ఈ సినిమాని తెరకెక్కించాలని నిర్మాతలు భావిస్తున్నారట . ఈ క్రమంలో ఖైదీ పాత్ర కోసం గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోలు నువ్వా.? నేనా.? అన్నట్లుగా ఈ సినిమా కోసం పోటీ పడుతున్నారట. ఆ రేస్‌లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో పాటు, మరో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గతేడాది ‘వార్’, ‘సూపర్ 30’ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి హృతిక్ రోషన్ మంచి జోష్ మీదున్నారు.
తన సక్సెస్‌ని కంటిన్యూ చేస్తూ హ్యాట్రిక్ కొట్టాలనే కసి మీదున్నాడు హృతిక్ రోషన్. మరోవైపు ఈ సినిమాలో నటించే ఛాన్స్ తానే దక్కించుకోవానుకుంటున్నాడు రణ్వీర్ సింగ్. ఓ సౌత్ రీమేక్ కోసం ఇద్దరు నార్త్ స్టార్స్ ఇంతలా పోటీ పడడం ఆనందించదగ్గ విషయమే. అయితే, హిందీ ‘ఖైదీ’కి కమర్షియల్ హంగులు కాస్త ఎక్కువేనట. వాస్తవానికి ‘ఖైదీ’ హీరోయిన్ లేని సినిమా. మరి, బాలీవుడ్‌కి ఈ కాన్సెప్ట్ వర్కవుట్ అవుతుందా.? కష్టమే. అందుకే బాలీవుడ్ ప్రేక్షకుల కోసం హీరోయిన్ గ్లామర్ హంగులు జోడిరచనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. చూడాలి మరి, హిందీ ‘ఖైదీ’ అయ్యే ఛాన్స్ ఎవరిని వరిస్తుందో, అక్కడి బాక్సాఫీసు రికార్డుల్ని ఎలా కొల్లగొట్టనుందో.