తొలి రోజు ఓవర్‌సీస్‌లో దుమ్ము రేపే కలెక్షన్లను కొల్లగొట్టింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150'. బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్ష్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇంకో వైపున తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 'ఖైదీ నెంబర్ 150' సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదంటున్నారు. 40 కోట్లకు పైనే తొలి రోజు వసూళ్ళను సాధించడం ద్వారా కమ్ బ్యాక్‌లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటినట్లయ్యింది. ఒక పక్క రికార్డుల మోత ఈ రకంగా ఉంటే, మరోపక్క కొందరు ఆకతాయిలు సినిమాలోని పాటల్ని యూ ట్యూబ్‌కి విడుదల చేయడంతో సినిమాకి నష్టం కలుగుతుందని అందరూ భావించారు. అయితే క్షణాల్లో నిర్మాత రామ్‌చరణ్ వాటిని యూ ట్యూబ్ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టడం జరిగింది. ఏం చేసినా, ఎలా జరిగినా, తొలి రోజు వసూళ్లు ఈ రేంజ్‌లో ఉండడం మెగాస్టార్ స్టామినాని రీ ఎంట్రీలో ప్రూవ్ చేశాయి. చిరంజీవిని తెరపై అలా చూసిన అభిమానులు ఆనందంతో పాటు ఉద్వేగానికి లోనవుతున్నారు. మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటితోనూ ఈ సినిమా నైజాం, సీడెడ్‌లోనే కాకుండా, ఓవర్ సీస్‌లో కూడా దుమ్ము రేపడం విశేషం. వినాయక్ ఈ సినిమాని ఏ మాత్రం రిస్క్ చేయకుండా మాతృకలోని కథని డిస్టర్బ్ కాకుండా, బాస్ బాడీ లాంగ్వేజ్‌కి భంగం కలగకుండా తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్‌కి చిరంజీవి తెరపై వేసే స్టెప్పులు చూసి ఫ్యాన్స్ 'బాస్ ఈజ్ బ్యాక్' అంతే అంటూ పండగ చేసుకుంటున్నారు.