నటిగానే కాకుండా ఒక రాజకీయవేత్త గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బు ఆరోగ్యం పైన కొన్ని రూమర్స్ వచ్చాయి.
అయితే ఆ రూమర్స్ ని ఖుష్బు ఖండించింది. ఇక ఆ మాశం పై తన ట్విట్టర్ ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను గాయపడడంతో ఆసుపత్రిలో చేర్పించారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. తనకి శస్త్రచికిత్స జరిగే మాటనిజమే అయితే డాక్టర్స్ ని సంప్రదించాక కొన్ని రోజుల అయ్యాక శస్త్రచికిత్స చేస్తామని తెలిపినట్టు అలాగే ఆ తరువాత కొన్నిరోజులు విశ్రాంతి కూడా తీసుకొమ్మని వారు సలహా ఇచ్చినట్టు ఆ పోస్టులో తెలిపారు.
దీనితో ఆమె అనారోగ్యం పైన వస్తున్న అనేక రూమర్స్ కి బ్రేక్ పడినట్టయింది. ప్రస్తుతం ఖుష్బు కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకురాలిగా ఆమె ఉన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహిస్తుంటారు.