ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానంటోంది ముద్దుగుమ్మ కైరా అద్వానీ. అప్పుడెప్పుడో స్కూల్ డేస్‌లో ఉండగానే ఈ పాప డేటింగ్ చేసేసిందట. కానీ, ఇప్పుడయితే డేటింగ్స్, గీటింగ్స్ లేవంటోంది. బాలీవుడ్‌కెళ్లాక, ఓ యంగ్ హీరోతో లవ్‌లో పడిందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ లవ్ గాసిప్స్‌ని అమ్మడు ఖండించేసిందనుకోండి. లవ్ గివ్ జాన్తా నై.. అంటోంది. తెలుగులో 'భరత్ అనే నేను' సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ, సెకండ్ సినిమా 'వినయ విధేయ రామ'తో ఫెయిల్యూర్ చవి చూసింది. కానీ, క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒకవేళ తెలుగులోనే కంటిన్యూ అయ్యి ఉంటే, ఈ పాటికి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయేదే. కానీ, సెకండ్ మూవీకే టాలీవుడ్‌కి టాటా బైబై చెప్పేసి, బాలీవుడ్‌కి చెక్కేసింది.
బాలీవుడ్‌కెళ్లాక దాదాపు డజను వరకూ సినిమాల్ని చేతిలో పెట్టేసుకుంది. అన్నీ క్రేజీయెస్ట్ ప్రాజెక్టులే. దాంతో టాలీవుడ్ వైపు తిరిగి చూసే అవకాశమే లేకుండా పోయింది కైరా అద్వానీకి. కానీ, తన కెరీర్‌ని టర్న్ చేయడానికి కారణం తెలుగు సినిమానే అయినా, తెలుగు సినిమానీ, తెలుగు ప్రేక్షకుల్నీ ఎప్పటికీ మర్చిపోననీ, అవకాశమొస్తే తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తానని చెప్పుకొస్తోంది. ఎప్పుడనేది.? ఆమెకే తెలియదు. సర్లే చూద్దాం.