21 రోజులు డేట్స్‌.. 50 కోట్లు రెమ్యునరేషన్‌!

మరిన్ని వార్తలు

ఏంటీ లెక్క అనుకుంటున్నారా.? పవన్‌ కళ్యాణ్‌ నటించబోయే సినిమా 'పింక్‌' రీమేక్‌ లెక్కలివి. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమా 'పింక్‌' రీమేక్‌. ఈ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ రెమ్యునరేషన్‌ అక్షరాలా 50 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. 21 రోజులు పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం డేట్స్‌ ఇచ్చారనీ ఫిలిం నగర్‌ టాక్‌. ఇటీవల జరిగిన 'వెంకీ మామ' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో పవన్‌ గురించి దిల్‌ రాజుని అడిగిన ఆడియన్స్‌కి ' పవర్‌ స్టార్‌ వస్తున్నాడు.. ఆన్‌ ది వే..' అంటూ క్యాజువల్‌గా ఆన్సర్‌ ఇచ్చాడు దిల్‌ రాజు. అంటే, పవన్‌ కళ్యాణ్‌ని తమ సినిమాలో నటింప చేసేందుకు తాము రెడీగానే ఉన్నామన్న దిల్‌ రాజు కాన్ఫిడెన్స్‌ని ఆడియన్స్‌ అర్ధం చేసుకున్నారు.

 

ఈ సినిమాకి 'లాయర్‌ సాబ్‌' అనే టైటిల్‌ అనుకుంటున్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ నటిస్తే పవన్‌ కళ్యాణ్‌ పోషించబోయే పాత్ర లాయర్‌. కాబట్టి, ఈ టైటిల్‌ యాప్ట్‌ అని భావిస్తున్నారట. ఇంకా రకరకాల టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయి. లేడీ లీడ్‌ రోల్స్‌లో ఇప్పటికైతే, అంజలి, నివేదా థామస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మెయిన్‌ లీడ్‌ రోల్‌ పోషించే హీరోయిన్‌ లిస్టులో సమంత, తాప్సీ పేర్లు వినిపిస్తున్నాయి కానీ, అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా అయితే, ఆల్రెడీ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. క్యారెక్టర్స్‌ విషయంలో క్లారిటీ లేదు. కానీ, తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS