హాట్‌ అండ్‌ స్వీట్‌ 'భరత్‌' బ్యూటీ

By iQlikMovies - July 31, 2018 - 12:48 PM IST

మరిన్ని వార్తలు

'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన బాలీవుడ్‌ అందాల భామ కైరా అద్వానీ. బాలీవుడ్‌లో ఏదో రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో వస్తూ వస్తూనే స్టార్‌ హీరోస్‌తో ఛాన్సెస్‌ దక్కించుకుంది. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. 

తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన నటిస్తోంది. చరణ్‌ - బోయపాటి శీను కాంబోలో రూపొందుతోందీ సినిమా. కాగా ఈ మధ్య ఈ బ్యూటీ బాలీవుడ్‌లో నటించిన 'లస్ట్‌ స్టోరీస్‌' అనే వెబ్‌ సిరీస్‌తో మాత్రం హాట్‌ బ్యూటీగా తెగ పాపులర్‌ అయిపోయింది. 'భరత్‌'లో ముఖ్యమంత్రికి లవర్‌గా హుందాగా కనిపించిన ఈ బ్యూటీకి 'లస్ట్‌ స్టోరీస్‌'తో అడల్ట్‌ ఇమేజ్‌ వచ్చినంత పనయ్యింది. అయితే చరణ్‌ సినిమాతో ఆ ఇమేజ్‌ని ఈ బ్యూటీ ఎలా పోగొట్టుకుంటుందో చూడాలి మరి.

ఇకపోతే సోషల్‌ మీడియాలోనూ కైరా అద్వానీకి ఫాలోయింగ్‌ బాగానే ఉంది. అందుకే తన ఫాలోయింగ్‌ని మరింత మెరుగు పరుచుకునేందుకే అప్పుడప్పుడూ ఈ బ్యూటీ ఇదిగో ఇలా హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతూ ఉంటుంది. ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నా హాట్‌నెస్‌ మిస్‌ కాకుండా ఉన్న ఈ గ్రీన్‌ డ్రస్సులో కైరా అందాలు కెవ్వుకేక పుట్టిస్తున్నాయిలే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS