'సైరా' రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ కీలకమైన పాత్రలో కన్పిస్తోన్న సంగతి తెల్సిందే. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

ఇప్పుడంటే రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా విభేదాల్ని కొందరు సృష్టిస్తున్నారుగానీ, ఒకప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో ఇవేమీ లేవు. అప్పట్లో దేశ స్వాతంత్య్రం కోసం అందరూ కలిసి పోరాడారు. ఆ పోరాటంలో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తనదైన ప్రత్యేకతను చాటుకుంటే, ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సహకరించిన తమిళ పోరాటయోధుడిగా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నటించబోతున్నాడట. ఈ విషయాన్ని విజయ్‌ సేతుపతి స్వయంగా ప్రకటించాడు. 

దాంతో, 'సైరా నరసింహారెడ్డి' సినిమా రేంజ్‌ ఒక్కసారిగా పదింతలయ్యింది. ఇండియన్‌ ఫిలింగా ఇప్పటికే 'సైరా నరసింహారెడ్డి' గురించిన ప్రచారం జరుగుతున్నా, ఈ స్థాయిలో సినిమాకి సంబంధించి ఇంపార్టెంట్‌ ఎలిమెంట్‌ రివీల్‌ అవడం ఇదే తొలిసారి. 

తొలి తెలుగు స్వాతంత్య్ర యోధుడి పోరాటమే కాదు, ఇది తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిగిన భారతీయుడి పోరాటమనీ, ఆ కారణంగా 'సైరా నరసింహారెడ్డి' సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశముందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS