తెలుగులో తొలి సినిమాకే అగ్ర హీరో మహేష్ బాబుతో నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ. రెండో సినిమాకీ మెగా కాంపౌండ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే 'భరత్ అనే నేను'లో మహేష్‌తో డాన్సుల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదీ ముద్దుగుమ్మకి.
కానీ చరణ్‌తో అలా కాదు, డాన్సుల్లో కింగ్ చరణ్. ఆయనతో డాన్స్ అంటే అంత ఆషామాషీ కాదు. అందుకే చరణ్‌తో సినిమా అనగానే కైరా అద్వానీ ముందుగానే ప్రిపేర్ అయ్యిందట. డాన్సుల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైద్రాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ విదేశాల్లో షూటింగ్‌తో బిజీగా ఉంది. అజర్ బైజాన్, యూరప్‌లలో పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు.
దాదాపు 25 రోజుల పాటు భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలున్నాయి. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత హీరో ప్రశాంత్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అలాగే యంగ్ హీరో ఆర్యన్ రాజేష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.