డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే పూరి ఈ సినిమా విషయంలో కాస్త కొత్తగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ముందుగా ఈ సినిమాని, పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడట పూరి. ఈ సినిమా స్టోరీ పాయింట్ యూనివర్సల్ పాయింట్ అని, అన్నిభాషలకు వర్కౌట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ ని పూరి రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షుకులకు కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యేవిధంగా బలమైన హ్యూమన్ ఎమోషన్ని సినిమాలో బాగా ఎలివేట్ చేయాలని ఆలోచిస్తున్నాడట.
ప్రస్తుతం పూరి టీమ్ బాలీవుడ్ కు సంబంధించిన కొంతమంది నిర్మాతలతో ఈ ప్రాజెక్ట్ భాగస్వామ్యం పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తుంది చిత్రబృందం. బాలీవుడ్ లో బజ్ రావాలంటే ఆమె అయితేనే బెస్ట్ అని పూరి ఫీల్ అవుతున్నాడట, మరి కియారా ఒప్పుకుంటుందా..? స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కోసం ఆరాటపడుతున్న ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ అంటే ఒప్పుకుంటుందో లేదో. అయితే ఇటివలే వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ లో కలిసి నటించారు. ఆ పరిచయంతో మనోడు ఈ బాలీవుడ్ బ్యూటీని ఒప్పిస్తాడేమో. ఇక ఈ సినిమా కూడా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.