మాస్ స్టోరీతో సుకుమార్ - బన్నీ ?

మరిన్ని వార్తలు

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ - స్టార్ హీరో అల్లు అర్జున్ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. 'వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో' చిత్రాలను కూడా సుకుమార్ రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. అలాగే ఈ సినిమాని కూడా అలాంటి జోనర్ లోనే తియనున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే రివెంజ్ ఫార్ములా కంటే కూడా ఎమోషనల్ సాగే యాక్షనే ఎక్కువ ఉంటుందని.. అలాగే బన్నీ పాత్ర కూడా ఫుల్ మాస్ యాంగిల్ లో వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది.

 

ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తో పాటు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందట. ఆ క్యారెక్టర్ లో ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ను తీసుకోనున్నారు. ఇక 'రంగస్థలం' సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. ఇక ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' నటిస్తున్నాడు. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS