ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతి ద్వారా ఇద్దరు మహిళలు వేర్వేరుగా గర్భం దాల్చాలనుకుంటారు. కానీ, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఒకరి భర్త వీర్యం, ఇంకొకరి భార్య గర్భంలోకి ప్రవేశపెట్టబడుతుంది. ఇక, ఆ తర్వాత జరిగే రచ్చ ఎలా వుంటుందో తెలియాలంటే 'గుడ్ న్యూస్' సినిమా చూడాల్సిందే. కామెడీ పేరుతో అత్యంత జుగుప్సాకరమైన వ్యవహారాల్ని తెరపైకి తీసుకురావడం బాలీవుడ్‌కి కొత్తేమీ కాదు.ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, కరీనా కపూర్ ఓ జంటగా నటిస్తోంటే, దిల్జిత్ దోసాంజే, కైరా అద్వానీ మరో జంటగా నటిస్తున్నారు.
అక్షయ్, దిల్జిత్‌ల పేర్ల చివర్న వున్న కామన్ 'బాత్రా' పేరు ఈ మొత్తం కన్‌ఫ్యూజన్‌కి కారణమట. రాజ్ మెహతా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ కాస్సేపటి క్రితం విడుదలయ్యింది. మొత్తం అందరూ పాపులారిటీ వున్న స్టార్లే.. అందరిలోకీ దిల్జిత్ దోసాంజే మాత్రమే కాస్త తక్కువ పాపులారిటీ వున్న నటుడని అనుకోవాలేమో. అక్షయ్‌కుమార్, కరీనాకపూర్‌లకు వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కైరా అద్వానీ, బాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేషన్.
దిల్జిత్ దోసాంజే కూడా తక్కువోడేమీ కాదు.. తక్కువ సినిమాలతో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు దక్కించేసుకున్నాడు. మొత్తమ్మీద ల్రైటర్ అయితే కాస్తంత ఇబ్బందికరమైన కాన్సెప్టే అయినా, బోల్డంత ఫన్‌తో రూపొందింది. డిసెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, హిరో జోహార్, శశాంక్ ఖైతాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.