రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న 'దర్బార్' సినిమాపై అంచనాలు ఆల్రెడీ ఆకాశాన్నంటేశాయి. రజనీకాంత్ స్టామినా అలాంటిది. గత సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా రజనీకాంత్ కొత్త సినిమాకి అంచనాలు అమాంతం పెరిగిపోవడం చూస్తూనే వున్నాం. 'దర్బార్' సినిమా విషయంలో ఈ అంచనాలు ఇంకా వేగంగా పెరిగిపోతున్నాయంటే, దానికి దర్శకుడు మురుగదాస్ కూడా ఓ కారణం కావొచ్చు.
రజనీకాంత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కన్పించబోతున్నారు.. అందులో ఒకటి పోలీస్ పాత్ర. ఇక, సినిమా డబ్బింగ్ విశేషాల్ని ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు దర్శకుడు మురగదాస్. తన జీవితంలోనే అత్యద్భుతమైన డబ్బింగ్ సెషన్ 'దర్బార్' కోసం జరిగిందంటూ రజనీకాంత్‌తో కలిసి వున్న ఓ ఫొటోని మురుగదాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిజమే, రజనీకాంత్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆయన్ని అలా చూస్తోంటే అదో ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారు చూసేవాళ్ళెవరయినా.
రజనీకాంత్ అంటేనే స్టయిల్.. తెరపైనే కాదు, తెరవెనుక కూడా ఆయన ఆ స్టయిల్‌ని అలా మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. ఎంత సింపుల్‌గా రజనీకాంత్ కన్పించినా, ఆటోమేటిక్‌గా ఆ స్టైల్ అలా కనిపించేస్తుంటుంది. 'దర్బార్' డబ్బింగ్‌ని రజనీకాంత్ చెబుతోంటే, అది చూసి.. మురగదాస్ చెప్పలేని ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యాడట. రజనీకాంత్ డైలాగ్ డెలివరీ చాలా వేగంగా వుంటుంది.. దాంట్లో ఓ స్టయిల్ వుంటందంటూ 'దర్బార్' డబ్బింగ్ విశేషాల్ని పంచుకున్నాడు మురుగదాస్.