గర్భిణిగా ఉన్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ త్వరలో ఓ బిడ్డకి జన్మనివ్వబోతోంది. హా.! కైరా తల్లి అయ్యిందా.? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీ ఆశ్చర్యాన్ని కాసేపు దాచి పెట్టి, అసలు సంగతి తెలుసుకోండి. రియల్‌గా కాదు, రీల్ కోసం కియారా తల్లి అయ్యింది. కియారా అద్వానీ, అక్షయ్ కుమార్ జంటగా 'గుడ్ న్యూస్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ (డిశంబర్ 27)ని ప్రకటిస్తూ, ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఈ ఏడాదిలో జరిగిన అతి పెద్ద తప్పిదం' అంటూ పోస్టర్‌పై రాసుంది.
ఈ పోస్టర్‌లో కియారా - అక్షయ్ జంటతో పాటు, కరీనా - దిల్జీత్ దోసాంజ్ జంట కూడా ఉంది. కరీనా కూడా గర్భవతే. కరీనా, కియరా బేబీ బంప్స్ మధ్య హీరోలు అక్షయ్, దిల్జీత్‌లు నలిగిపోతున్నట్లు ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు. అంటే, 'గుడ్‌న్యూస్'తో క్రిస్మస్‌కి నవ్వుల విందు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఈ నలుగురూ చెప్పకనే చెబుతున్నట్లుందన్న మాట. ఇంకెందుకాలస్యం, నవ్వుల క్రిస్మస్‌కి సిద్ధం కావాల్సిందే. గతంలో కరీనా కపూర్ - అక్షయ్ కుమార్ జంటగా పలు ఎంటర్‌టైనింగ్ మూవీస్ వచ్చాయి.
ఈ సారి అక్షయ్‌కి జంటగా కియారా నవ్విస్తానంటోంది. తెలుగులో మహేష్, చరణ్‌లతో నటించి, బాలీవుడ్‌కి చెక్కేసిన కియారా అద్వానీ, 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో క్రేజ్ సంపాదించింది. క్రేజ్‌తో పాటు వరుసగా ప్రెస్టీజియస్ ఆఫర్స్ కూడా దక్కించుకుంది. వాటిలోంచి ఒకటి ఈ 'గుడ్ న్యూస్' మూవీ. చూడాలి మరి, అసలే గుడ్ టైమ్ రైజింగ్‌లో ఉన్న కియారాకి 'గుడ్ న్యూస్' మరో గుడ్ హిట్ అవుతుందేమో.