గ్లామ్‌షాట్‌: పోత పోసిన శిల్పంలా కైపెక్కిస్తోంది!

మరిన్ని వార్తలు

కైరా అద్వానీ, ఈ బ్యూటీ క్రేజుకి ఆకాశమే హద్దయ్యిందిప్పుడు. 'భరత్‌ అనే నేను' సినిమాతో వస్తూ వస్తూనే కుర్రోళ్ల మనసుల్ని విశేషంగా దోచేసింది. తర్వాత 'వీవీఆర్‌'లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో మాస్‌ స్టెప్పులిరగదీసేసింది. రెండు సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా, విపరీతమైన క్రేజ్‌ దక్కించుంది. బాలీవుడ్‌ నుండి వచ్చి, టాలీవుడ్‌లో కైపెక్కించి, మళ్లీ బాలీవుడ్‌లో కొత్తగా సత్తా చాటేస్తోంది. అతి త్వరలో 'కబీర్‌సింగ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కైరా అద్వానీ, ఇప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్‌ని దాటి రాలేనంత బిజీగా గడిపేస్తోంది.

 

అయినా తెలుగు ప్రేక్షకులంటే తనకెంతో ఇష్టమంటోంది. మీకోసం మళ్లీ మళ్లీ వస్తా అంటోంది. సినిమాల సంగతి అలా ఉంటే, సోషల్‌ మీడియాలోనూ, పిచ్చ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. తాజాగా సోషల్‌ మీడియాలో కైరా అద్వానీ పోస్ట్‌ చేసిన పిక్‌ చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. బ్రైట్‌ బ్లూ కలర్‌ మోడ్రన్‌ డ్రస్సులో కైరా అందాలు మాటల్లేవ్‌. మాట్లాడుకోవడాల్లేవ్‌ అన్నట్లుగా ఉన్నాయి. ఓ హెయిర్‌ ఆయిల్‌ ప్రమోషన్స్‌ నిమిత్తం కైరా ఇలా దర్శనమిచ్చింది. అస్సలు ఆలస్యం చేయకుండా అర్జెంటుగా ఈ పిక్‌పై ఫోకస్‌ పెట్టాల్సిందే.. ఈ కైపెక్కించే అందాలు ఆస్వాదించాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS