బాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ ఇప్పుడు కైరా అద్వానీ. ఇటీవల విడుదలైన 'కబీర్‌సింగ్' ఇచ్చిన సక్సెస్ ఆమెని అమాంతం స్టార్ హీరోయిన్ల లిస్టులో పడేసింది. స్టార్డమ్తో పాటు బోలెడంత క్రేజ్ కూడా సంపాదించేసింది. వరుస ఆఫర్లతో బాలీవుడ్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోందక్కడ కైరా అద్వానీ. అంత బిజీ షెడ్యూల్లో ఓ మోడలింగ్ ఈవెంట్ కోసం ఇదిగో ఇలా రెడ్ హాట్ కాస్ట్యూమ్‌లో కనిపించి అదరహో అనిపించింది. డీప్ నెక్, శాంతం ఓపెన్‌గా కనిపించేలా డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్లో కైరా ధగ ధగా మెరిసిపోయింది. ఈ డ్రస్సులో కైరాని చూసిన కుర్రోళ్లు అందమంటే నీదేనా అనుకోకుండా ఉండలేకపోయారు.
ఫేస్‌లో క్యూట్‌నెస్, స్కిన్‌లో బ్రైట్నెస్, గ్లామర్‌లో హాట్నెస్ ఇవన్నీ చక్కగా కుదిరాయి కైరాకి. అందుకే కెమెరా కన్ను కూడా చూపు తిప్పుకోలేకపోయింది. క్లిక్ క్లిక్ అంటూ వరుసపెట్టి డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలు క్లిక్మనిపించేసింది. అలా క్లిక్ అయిన ఫోటోలు ఊరికే ఉంటాయా. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. అసలే అమ్మడికి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఊరికే ఉండదు కదా. కామెంట్ల మీద కామెంట్లు, లైకుల మీద లైకులూ కొట్టేస్తూ, కైరా అందాన్ని ఆకాశానికేత్తేస్తోంది. ఆలస్యం చేయకుండా అర్జెంట్‌గా కైరా అందాలపై మీరూ ఓ లుక్కేసేస్కోండిక.