మహేష్‌ కోసం, రీఎంట్రీ ఇస్తోన్న మరో సీనియర్‌ నటి!

By iQlikMovies - July 23, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌..' అంటూ 'ఖడ్గం' సినిమాలో అమాయకంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ సంగీత. గ్లామర్‌ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లోనూ కనిపించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. గత కొంతకాలంగా సంగీత రీ ఎంట్రీపై కొన్ని గాసిప్స్‌ వస్తున్నాయి. ఎట్టకేలకు గాసిప్స్‌ నిజమయ్యాయి. సంగీత రీ ఎంట్రీ షురూ అయ్యింది. ఇంతకీ ఎవరి సినిమాతో సంగీత రీ ఎంట్రీ ఇవ్వబోతోందనుకుంటున్నారా? ఇంకెవరు మన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సినిమాతో.

 

అనిల్‌ రావిపూడి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సంగీత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌కి దగ్గరగా ఉండే ఓ ఇంపార్టెంట్‌ పాత్రలో సంగీత కనిపించనున్నారట. అంటే హీరోయిన్‌ తల్లినా.? లేక అక్కనా.? మరింకెవరైనానా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, మొత్తానికి సంగీతకు రీఎంట్రీలో మంచి సినిమా, మంచి క్యారెక్టర్‌ దొరికిందనే చెప్పాలి.

 

ఆల్రెడీ ఈ సినిమాతో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు అయిన బండ్ల గణేష్‌ నటనకు దూరమై చాలా కాలమే అయ్యింది. ఆయన కూడా ఇదే సినిమాతో మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నారు. అలా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ముగ్గురు మంచి నటీ నటుల్ని తిరిగి వెండితెరపై మెరిసేలా చేస్తోందన్న మాట. మహేష్‌ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మికా మండన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS