బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు ముద్దుగుమ్మ కైరా ఆద్వానీకి. కానీ తెలుగులో సూపర్‌స్టార్ మహేష్‌తో 'భరత్ అన నేను' చిత్రంలో నటించాక ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది. తెలుగులో కొట్టిన బోణీతో ఆ తర్వాత అటు బాలీవుడ్లో కూడా కైరా అద్వానీ పాపులారిటీ పెరిగింది. ఒకేసారి ఇటు 'భరత్'తోనూ, 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌తోనూ ప్రేక్షకుల ముందుకు రావడంతో, అమ్మడికి చెప్పలేనంత క్రేజ్ వచ్చేసింది. దాంతో బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోతోంది కైరా అద్వానీ. టాలీవుడ్‌కి వస్తూ వస్తూనే, రెండు బిగ్ ప్రాజెక్టులపై సైన్ చేసి అడుగు పెట్టింది. ఆల్రెడీ ఒక సూపర్ హిట్ కొట్టేసింది. మరో హిట్‌కి రెడీగా ఉంది. బోయపాటి శీను - చరణ్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే బాలీవుడ్లో 'గుడ్‌న్యూస్' అనే కొత్త మూవీకి సైన్ చేసింది. తాజాగా 'ఫెమినా' మేగ్జైన్ కోసం ఇదిగో ఇలా క్రియేటివ్‌గా కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకుని అభిమానుల్లో తనకున్న క్రేజ్‌ని మరింత పెంచుకోవాలనుకుంటోంది హాట్ హాట్ కైరా అద్వానీ.