తెలుగులో సంచలన విజయం అందుకున్న 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్నాడు. లేటెస్టుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరిగింది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే హావభావాలు కరెక్ట్‌గా పలికే ఫ్రెష్ ఫేస్ ఉన్న ముద్దుగుమ్మని హీరోయిన్‌గా ఎంచుకోవాలనుకున్నారు. మొదట్లో ఆ ఆఫర్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని వరిస్తుందేమో అనుకున్నారంతా. అయితే తాజాగా ఆ పాత్రకు 'భరత్' బ్యూటీ కైరా అద్వానీని ఎంచుకున్నారు. తెలుగులో షాలినీ పాండే ఈ పాత్రకు న్యాయం చేసింది. తొలి సినిమా అయినా మంచి పేరు దక్కించుకుంది పర్‌ఫామెన్స్‌లో.
బాలీవుడ్‌లో ఆల్రెడీ రెండు సినిమాల్లో నటించిన కైరా అద్వానీకి తెలుగులో మహేష్‌బాబుతో నటించిన 'భరత్ అనే నేను' మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత హిందీలో చేసిన 'లస్ట్ స్టోరీస్'తోనూ పాపులర్ అయ్యింది. లేటెస్టుగా అందుకున్న ఈ ఆఫర్‌తో ఆమెకు బాలీవుడ్‌లో మరింత గుర్తింపు దక్కే అవకాశాలు లేకపోలేవు.
మరోవైపు తెలుగులో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన నటిస్తోంది కైరా అద్వానీ. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగులోనూ, హిందీలోనూ కూడా ఏకకాలంలో క్రేజీ ఆఫర్స్‌తో దున్నేస్తోంది అందాల భామ కైరా అద్వానీ.