రెడ్‌ కార్పెట్‌పై అందాల శిల్పం.!

By iQlikMovies - September 25, 2018 - 11:34 AM IST

మరిన్ని వార్తలు

సైమా అవార్డ్స్‌ ఫంక్షన్‌ అనగానే అందమైన ముద్దుగుమ్మలు తమలోని అందాలకు మరింత పదును పెట్టి, రెడ్‌ కార్పెట్‌పై వయ్యారాలొలకాలనుకుంటారు. డిఫరెంట్‌ స్టైల్స్‌లో కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయించుకుని వాటిని ధరించి అందంగా మెరిసిపోతుంటారు. అలాగే సైమా అవార్డ్స్‌ ఫంక్షన్స్‌లో ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌ సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లేక్‌ చెమ్కీ లాంగ్‌ ఫ్రాక్‌లో హాయిగా నవ్వులు చిందిస్తూ గ్లామరస్‌గా కెమెరాలకు పోజిచ్చేసింది. ఆ అందమైన నలుపు మెరుపుల గౌనులో ప్రగ్యా నిజంగానే చాలా చాలా అందంగా ఉంది. అదేమీ మామూలు గౌను కాదండోయ్‌. అక్కడక్కడా ఉన్న కట్స్‌ మధ్య నుండి ఈ సొగసరి కాలి సోయగాలను ఎలివేట్‌ చేస్తూ, ఓ పక్క డ్రస్సుకు, డ్రస్సు ధరించిన ముద్దుగుమ్మకు మరింత అందాన్నిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS