అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్.. కాదు కాదు, రెండు లుక్స్ ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విషయం విదితమే. ఈ పోస్టర్స్ ఇంకా సౌండ్ చేస్తూనే వున్నాయి. ఈ సౌండ్ బాలీవుడ్ వరకూ పాకింది. అల్లు అర్జున్‌కి సంబంధించినంతవరకు ఇది తొలి పాన్ ఇండియా ఫిలిం. తెలుగుతోపాటు వివిధ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం విదితమే. రష్మిక మండన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించబోతోంది. ఇదిలా వుంటే, తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం దర్శకుడు సుకుమార్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంటాడు.
‘రంగస్థలం’ సినిమా కోసం పూజా హెగ్దేని ఐటమ్ బాంబులా మార్చేసిన విషయం విదితమే. ‘జిగేలురాణి..’ అంటూ సాగే ఆ సాంగ్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమా కోసం సుకుమార్, బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నాడట. కైరా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించిన విషయం విదితమే. కైరా అద్వానీ మంచి డాన్సర్.. అల్లు అర్జున్‌తో పోటీ పడి డాన్సులేయగల సత్తా ఈ బ్యూటీకి వుంది.