పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ సినిమాలో నటించిన అందాల భామ మీరా చోప్రా గుర్తుందా? అదేనండీ, నితిన్ సరసన ఓ సినిమాలో కూడా చేసిందీ చోప్రా బ్యూటీ. సౌత్‌లో రకరకాల పేర్లతో సినిమాలు చేసి, ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మీరా చోప్రా’గా సెటిలైపోయిన ఈ ‘బంగారు మేని’ భామ, ప్రస్తుతం పెద్దగా సినిమా ఛాన్సుల్లేక.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో టైమ్ పాస్ చేస్తోంది. బాలీవుడ్‌లో ‘చోప్రా’ ట్యాగ్‌లైన్ పెట్టుకుని కొన్ని సినిమాలు అయితే దక్కించుకుందిగానీ, అవేమీ ఆమెకి పెద్దగా హిట్లు ఇవ్వలేకపోయాయి. దాంతో, ఈ బ్యూటీ మనసు ఇప్పుడు వెబ్ సిరీస్‌లవైపు అడుగులేస్తోందట.
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై ఓ ఊపేసిన ‘లస్ట్ స్టోరీస్’ తరహా వెబ్ సిరీస్ ఒకటి ఓ ప్రముఖ నిర్మాత సారధ్యంలో రూపొందనుందనీ, అందులో మీరా చోప్రా ఓ హాట్ రోల్‌లో కన్పించబోతోందనీ తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం మీరా చోప్రా కాస్త గట్టిగానే రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోందని సమాచారం. ‘అందులో కంటెంట్ అలాంటిది మరి..’ అంటున్నారు బాలీవుడ్ సినీ జనం. వెబ్ సిరీస్‌లకు సెన్సార్ వుండదు. దాంతో, ఏ స్థాయిలో అయినా ‘హాట్ కంటెంట్’ని చిత్రీకరించేయొచ్చు. పైగా, ఇప్పుడు టాప్ హీరోయిన్లు కూడా, హద్దులు దాటిన శృంగారానికి ఓకే చెప్పేస్తుండడంతో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. సో, అతి త్వరలో మీరా చోప్రాని హాట్ హాట్‌గా వెబ్ సిరీస్‌లో చూసెయ్యబోతున్నామన్నమాట.