'భరత్‌' బ్యూటీకి అక్కడ తిరుగే లేదు!

By iQlikMovies - June 22, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

సక్సెస్‌తో సంబంధం లేకుండా తెలుగులో క్రేజ్‌ సంపాదించింది ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఇక్కడ తెచ్చుకున్న క్రేజ్‌తో బాలీవుడ్‌లోనూ రాకెట్‌ స్పీడుతో దూసుకెళ్తోంది. తెలుగులో అడుగు పెట్టాక కానీ, కియారా విలువ బాలీవుడ్‌కి తెలియలేదు కాబోలు. తెలుగులో బ్యాక్‌ టు బ్యాక్‌ ఇద్దరు స్టార్‌ హీరోస్‌తో నటించేసరికి బాలీవుడ్‌ పిలిచి మరీ బిగ్‌ ఆఫర్స్‌ ఇచ్చేస్తోంది. ఖాళీ దొరికితే కియారా ఎక్కడ బాలీవుడ్‌ని వదిలి వెళ్లిపోతుందో, ఇంతందాన్ని మేమెందుకు ఇన్నాళ్లూ మిస్‌ చేసుకున్నామో అన్నట్లుగా కియారాని అక్కడ లాక్‌ చేసేసింది బాలీవుడ్‌. ప్రస్తుతం అలా కియారా చేతిలో ఉన్నవన్నీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులే. ఐదారు సినిమాల వరకూ కియారా చేతిలో ఉన్నాయి అక్కడ.

 

ఇక తాజా వివరాల్లోకి వెళితే, కియారా నటించిన 'కబీర్‌సింగ్‌' బాలీవుడ్‌లో ఫ్రెష్‌గా రిలీజై, రికార్డులు సృష్టిస్తోంది. భారీ ఓపెనింగ్స్‌ సాధించి అటు హీరో షాహిద్‌ కపూర్‌కీ, ఇటు కియారాకీ కూడా కెరీర్‌ బెస్ట్‌ సక్సెస్‌నిచ్చింది. తొలి రోజే 20 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. ఇక వీకెండ్‌లో 'కబీర్‌సింగ్‌' హవా ఎలా ఉండబోతుందో అంచనా వేయలేకపోతున్నారు అక్కడి ట్రేడ్‌ పండితులు. తెలుగు'అర్జున్‌రెడ్డి' సినిమాకి హిందీ రీమేక్‌గా తెరకెక్కింది 'కబీర్‌సింగ్‌'. ఒరిజినల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS