ఈ ఫోటో చూసి ఏదో జిమ్‌లో కసరత్తులు చేయడానికి వచ్చిందనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లేనండోయ్. ఫోటోలో ఉన్నది భరత్ భామ కైరా అద్వానీ. ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఫోటో ఇది. అయితే ఆమె కాస్ట్యూమ్ చూసి, ఏ మార్నింగ్ వాక్‌కో, లేక జిమ్‌కో బయలుదేరినట్లుంది కదా. వైట్ స్లీవ్‌లెస్ టాప్, బ్లూ కలర్ ట్రాక్ పాంట్‌లో హాటెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోంది. 'భరత్ అనే నేను' చిత్రంతో బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిందీ భామ. తొలి సినిమాకే తిరుగులేని విజయం తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా, వస్తూ వస్తూనే సూపర్‌స్టార్‌తో పాటు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సినిమాలోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం చరణ్ - బోయపాటి సినిమా కోసం ముస్తాబవుతోంది. లేటెస్టుగా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ కైరా అద్వానీ.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Kiara Advani