అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కేన్స్‌లో మెరిసిపోవడానికి ముద్దుగుమ్మలు కలలు కంటూ ఉంటారు. కొద్ది మందికి మాత్రమే ఆ కలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ ఏడాది మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొనె, ఐశ్వర్యారాయ్ తదితరులు కేన్స్‌లో సందడి చేశారు. వారితో పాటు రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ కూడా తన అందాలతో మురిపించింది. స్కిన్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో ఈ కొత్త పెళ్లికూతురు హాట్ హాట్‌గా మెరిసిపోయింది. సోనమ్‌లో ఇంకా పెళ్లి కళ అలాగే ఉంది. అంతేకాదు, పెళ్లి కోసం పెట్టుకున్న మెహందీ, ఉంగరాలు కేన్స్‌లో ఆమె అందానికి మరింత కళ తెచ్చిపెట్టాయి. కాగా ఈ సారి కేన్స్‌లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా హాట్ ప్రదర్శన ఇచ్చింది. కేన్స్‌లో మెరిసిపోవడం కంగనాకి ఇదే తొలిసారి.
ALSO SEE :
Sonam Kapoor Cannes Photos