‘ఆకు’ మాటున గ్లామర్‌ ‘ఘాటు’ అంతగానా.!

మరిన్ని వార్తలు

ఆకు చాటు పిందెల్లా అందాల భామ తమలోని అందాల్ని మెరిపిపస్తూ మురిసిపోతుంటారు. ఆ అందాల్ని ఆరాంగా చూసి నెటిజనులు మైమర్చిపోతుంటారు. కానీ, అందాల భామ కియారా అద్వానీ మాత్రం ఆకు మాటున అర్ధ నగ్నంగా మెరిసిన తీరు నెటిజన్స్‌ని విస్మయపరుస్తోంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌ని అధిరోహించగల కెపాసిటీ ఉండీ, బాలీవుడ్‌ వైపు వెళ్లిపోయింది కియారా. లక్‌ కలిసొచ్చింది అక్కడి స్టార్‌డమ్‌కి ఈజీగా బరిలోకి దిగింది. క్రేజీ ఆఫర్స్‌తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టేస్తోంది. స్వతహాగా కియారాకి ఫ్యాషన్‌ రంగంపైనా మంచి పట్టుండడంతో, బహిరంగ వేడుకలకు హాజరయినప్పుడు కిర్రాక్‌ లుక్స్‌లో కవ్విస్తుంటుంది.

kiara advani hot

వీలు చిక్కినప్పుడల్లా హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో అంతర్జాలాన్నీ హీటెక్కించేస్తుంటుంది. హాట్‌నెస్‌లో ఇంత ట్రాక్‌ రికార్డున్న కియారా, స్టిల్‌ ఫోటో గ్రాఫర్‌ డబు రత్నానీ చేతిలో పడితే ఇంకెలా ఉంటుంది.! అందగత్తెల అందాలకు తన కెమెరాతో మరింత వన్నెలద్ది చూపించే టాలెంట్‌ ఉన్న డబు రత్నానీ 2020 క్యాలెండర్‌లో మెరిసిపోయేందుకు, కియారాకి ఛాన్స్‌ చిక్కింది. ఇంకేముంది.. అన్నీ మర్చిపోయి అర్ధనగ్న ప్రదర్శనతో రెచ్చిపోయింది. వెట్‌ గ్లామర్‌లో టాప్‌లెస్‌గా కనిపించి షాకిచ్చింది. ఇప్పుడీ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హీరోయిన్‌గా ఆ రేంజ్‌ క్రేజ్‌ ఉన్న కియారా మరీ ఇంతలా దిగజారిపోవాలా.? అంటూ కొందరు నెటిజన్స్‌ మండిపడుతుంటే, అసలీ ఫోటోలో ఉన్నది కియారానే కాదని ఇంకొందరు అంటున్నారు. లేదు లేదు కియారా మార్ఫింగ్‌ ఫోటో ఇది అని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ‘ఆకు మాటు’ కియారా అందాలు నెట్టింట్లో పెద్ద చర్చకు తెర లేపుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS