ఆమె నోటికి అడ్డూ అదుపూ లేదు. సోషల్ మీడియా వేదికగా ఎవర్ని టార్గెట్ చేయానుకుంటే, వారిని నిస్సిగ్గుగా టార్గెట్ చేస్తూ బూతు పురాణం వల్లె వేస్తుంటుంది. ‘ఆమె’ ఎవరో అర్ధమైపోయే ఉంటుంది.. హాట్ హాట్ శ్రీరెడ్డి. నటిగా సుపరిచితురాలైనా, సోషల్ మీడియా బూతు పంచాంగంతోనే శ్రీరెడ్డి కి ఫాలోయింగ్ ఎక్కువ. తనకు నచ్చిన వారిని ఆకాశానికెత్తేస్తుంది. నచ్చకపోతే, బూతు బురదలో దించేస్తుంది. అలా చాలామంది శ్రీరెడ్డి బాధితులున్నారు ఇండస్ట్రీలో. అన్నట్లు భాషతో కూడా సంబంధం లేదు పాపం ఈ హాట్ పాపకి. ఇకపోతే, తాజాగా ఈమె నోటిలో పడి, నటి కరాటే కళ్యాణి విలవిల్లాడిపోతోంది. శ్రీరెడ్డి బూతు పురాణం భరించలేక ఆమె పోలీసునాశ్రయించింది.
ఫేస్‌బుక్ వేదికగా లైవ్ టెలికాస్ట్ చేస్తూ కరాటే కళ్యాణిని బూతులతో ఆడేసుకుంటోందట శ్రీరెడ్డి. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ, ఆ లైవ్ ప్రసారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు చూపిస్తూ, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాంటూ ఏసీపీ కె.వి.యం.ప్రసాద్‌ని అభ్యర్ధించారు కరాటే కళ్యాణి. ఈ మేరకు వాటిని పరిశీలించిన ఏసీపీ, ఐటీ చట్టం కింద 67 సెక్షన్‌తో పాటు, 506, 509 సెక్షన్స్ కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే ఈ తరహా అనేక కేసులు గతంలో శ్రీరెడ్డిపై నమోదయిన సంగతి తెలిసిందే. వాటిలో ఇవి కొన్ని. ఎన్ని కేసులు పెట్టినా శ్రీరెడ్డి మాత్రం తన తీరు మార్చుకోదంతే.