వివాదంలో చిక్కుకున్న మహేష్ హీరోయిన్..!

By iQlikMovies - June 25, 2018 - 17:55 PM IST

మరిన్ని వార్తలు

'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన కియారా అద్వానీ ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన పాత్ర, అభినయించిన విధానం టాక్ అఫ్ ది ఇండియాగా మారిపోయింది.

ఆ వివరాల్లోకి వెళితే, శారీరక సంతృప్తి పొందని ఒక భార్య పాత్రలో కనిపించిన కియారా అద్వానీ ఈ వెబ్ సిరీస్ లో స్వయంతృప్తి పొందే  ఒక సన్నివేశంలో నటించింది. ఆ సన్నివేశానికి BGMలో ఒక ప్రముఖ హిందీ చిత్రం కోసం లెజెండరీ గాయకురాలు అయిన లతా మంగేష్కర్ ఆలపించిన ఒక కీర్తనని వాడారు.

అయితే ఈ రెండింటికీ దర్శకుడు కరణ్ జోహార్ కావడంతో ఆ ఆలాపన వాడినట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు లతా మంగేష్కర్ సన్నిహితులు మాత్రం అలాంటి ఒక సన్నివేశానికి ఆమె ఎంతో పవిత్రంగా ఆలపించిన కీర్తనని ఎలా ఉపయోగిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

దీనితో ఇప్పటికే అనేక వివాదాలు ఈ వెబ్ సిరీస్ ని చుట్టుముట్టగా ఇది ఒక అంశం ఆ జాబితాలో తాజాగా చేరినట్టయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS