ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతున్న కియారా

మరిన్ని వార్తలు

పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తాచాటుతున్న కియారా ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీతో జనవరి 10 న ఆడియన్స్ ముందు వస్తోంది. టీమ్ మొత్తం ప్రమొషన్స్ తో బిజీగా ఉంది. కానీ ఎక్కడా కియారా మాత్రం కనిపించలేదు. వందల కోట్లు పెట్టి  పాన్ ఇండియా సినిమాలు తీసి ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి మేకర్స్ శ్రమిస్తూ ఉంటే హీరోయిన్స్ కొందరు ప్రమోషన్స్ ఎగ్గొడుతున్నారు. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం రష్మిక టీమ్ తో కలిసి అన్ని రాష్ట్రాలకి వెళ్ళింది. ప్రతి ఈవెంట్ లోనూ రష్మిక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ కియారా మాత్రం సౌత్ లో ఎక్కడ ప్రమోషన్ జరిగినా రావటానికి ఆసక్తి చూపించటం లేదు.

కేవలం ముంబయిలో ప్రమోషన్స్ కోసం మాత్రమే అటెండ్ అవుతోంది. తాజాగా హిందీ బిగ్ బాస్ హౌస్ లో చెర్రీతో కలిసి ప్రమోషన్ కి వెళ్ళింది. ముంబయి లో జరిగే ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యింది. కానీ సౌత్ ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతోంది. లాస్ట్ కి బాలయ్య అన్స్టాపబుల్ షో కి కూడా కియారా రావటం లేదు. చెర్రీ సోలోగా ఈ షో లో ప్రమోషన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ లో కియారా కనిపించకపోవడంతో అంతా ఆమె గూర్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలి ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాటిస్పెట్ చేస్తోంది. చివరికి అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఈవెంట్ కు కియరా ఆప్సేంట్ అయ్యింది.

లక్నోలో జరిగిన టీజర్ లాంఛ్ ఈవెంట్ లో మెరిసింది కియారా. ప్రస్తుతం ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. కనీసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు అయినా కియారా వస్తుందా రాదా అని  ఫాన్స్ సందేహ పడుతున్నారు. ఫ్రీరిలీజ్ ఈవెంట్ చాలా ముఖ్యమైనది దీనికి కూడా కియారా రాకపోతే అమ్మడికి తెలుగులో ఛాన్స్ లు రావట కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ప్రమోషన్స్ లో హీరోయిన్స్ కూడా కీలకమే, అలాంటిది ఏ ఈవెంట్ కి హీరోయిన్ రాకపోతే ఎదో అసంతృప్తి మిగిలిపోతుంది. అందుకే వారిని దూరం పెట్టె ఛాన్స్ లు ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS