అక్కినేని హీరోలు గత కొన్నాళ్లుగా హిట్స్ లేక సతమవుతున్నారు. నాగార్జున, చైతన్య, అఖిల్ వీరందరి పరిస్థితి అదే. ప్రస్తుతం నాగ్ మల్టీ స్టారర్ మూవీస్ చేస్తున్నారు. నాగ చైతన్య తండేల్ లాంటి పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు. ఇక అఖిల్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదని అక్కినేని ఫాన్స్ నిరుత్సాహాంగా ఉన్నారు. కానీ అఖిల్ ఇప్పటికే ఒక మూవీకి వర్క్ చేస్తున్నాడు. కానీ అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వటం లేదు టీమ్. అనవసరంగా అంచనాలు పెంచేయటం ఎందుకని కామ్ గా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారట. ఈ క్రమంలోనే అఖిల్ చేస్తున్న మూవీకి బాలీవుడ్ విలన్ ని రంగంలోకి దింపినట్లు టాక్.
ప్రజంట్ ట్రెండింగ్ లో ఉన్న పాన్ ఇండియా సినిమాల కారణంగా బాలీవుడ్ నటులు సౌత్ లో విలన్స్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాబీ డియోల్, అర్జున్ రామ్ పాల్, సైఫ్ అలీ ఖాన్, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్ తెలుగు సినిమాలో విలన్ల అవతారం ఎత్తారు. ప్రజంట్ తెలుగు సినిమాలో బాలీవుడ్ విలన్ ఫ్యాషన్ అయిపోయింది. ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ అఖిల్ మూవీ కోసం బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ గాంధీని విలన్ గా తీసుకొస్తున్నారు.
ప్రతీక్ గాంధీ అంటే పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు కానీ '1992 స్కామ్' వెబ్ సిరీస్ ఫేమ్ అంటే వెంటనే గుర్తు పడతారు. అఖిల్ ప్రజంట్ మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది అఖిల్ కెరియర్లో 6TH మూవీ. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పడు విలన్ కూడా ఫిక్స్ అయ్యాడు. హీరోకి ధీటుగా విలన్ పాత్ర ఉంటుందని టాక్. పైగా అఖిల్ కి పర్ఫెక్ట్ విలన్ దొరికాడని టీమ్ కూడా ఎగ్జైట్ అవుతోంది అంట. అఖిల్ సినిమాతో తెలుగు తెరకి మరో బాలీవుడ్ విలన్ దొరికాడు.