హీరోయిన్స్‌కి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ అంటే ఆడియన్స్‌కి ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ లవ్ మ్యాటర్స్ అంటే మరీ ఇంట్రెస్ట్. అందుకే అప్పుడప్పుడూ చిన్న చిన్న గాసిప్స్ పుట్టించి మరీ, హీరోయిన్స్‌కి లవ్ లింకులు కలిపేస్తుంటారు. అలా తాజాగా కియారా అద్వానీ లవ్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఆమె బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో లవ్‌లో ఉన్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి.
వీరిద్దరూ కలిసి నటించిన 'కబీర్ సింగ్' బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది కియారా అద్వానీ. వరుసగా ప్రెస్జీజియస్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ తరుణంలోనే తనపై వచ్చిన లవ్ గాసిప్స్‌ని ఖండించింది. ప్రస్తుతం తన మనసులో ఎవరూ లేరనీ, అయినా, లవ్ అనేది చాలా గొప్ప ఫీలింగ్ అనీ, ఆ ఫీలింగ్‌ని ఖచ్చితంగా ఎక్స్‌ప్రెస్ చేయాలనీ, ఒకవేళ తను ఎవరితోనైనా లవ్‌లో పడితే, ఆ విషయాన్ని బయటికి చెప్పుకోవడానికి అస్సలేమాత్రం సిగ్గుపడనీ కియరా చెప్పుకొచ్చింది.
తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో నటించిన కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. సౌత్‌లో ఆమె కోసం క్రేజీ ప్రాజెక్టులు ఎదురు చూస్తున్నా నార్త్‌ని వదిలి, సౌత్‌కి రాలేనంత బిజీగా ఉంది కియారా అద్వానీ.