'అడ్డుకున్నోడిదే అధికారం' అనే టాస్క్‌లో కెప్టెన్సీ కోసం బాబా భాస్కర్, హిమజ, శ్రీముఖి పోటీ పడ్డారు. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఇసుక బాక్సుల్లో కెప్టెన్సీ కోసం ఎంచుకున్న ముగ్గురు వ్యక్తులకూ, అనర్హులుగా కేటాయించిన రాహుల్, రవి, శిల్పా చక్రవర్తి హెల్ప్ చేయాలి. ఇసుక బాక్సుల్లో మిగిలిన కుటుంబ సభ్యులు మగ్గులతో ఇసుక పోస్తుండగా, ఇసుక పోయకుండా కెప్టెన్సీ అర్హులు అడ్డుకోవాలి.
వీరికి హెల్ప్ చేసే రాహుల్, రవి, శిల్పలు బాక్సుల్లో పడిన ఇసుకను బయటికి వేయాలి. అలా బాబా భాస్కర్ - శిల్ప, హిమజ - రాహుల్, శ్రీముఖి - రవి జంటలుగా ఈ టాస్క్ సాగింది. మిగిలిన ఇంటి సభ్యులు తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ, వారి బాక్సుల్లో ఇసుకను నింపుతూ ఉండాలి. అరతా బాగానే ఉంది. కానీ, కెప్టెన్సీ కోసం పోటీ పడే ముగ్గురు మాత్రమే మిగిలిన ఇంటి సభ్యులు వేస్తున్న ఇసుకను అడ్డుకోవాలి అది టాస్క్‌లో బిగ్‌బాస్ చెప్పిన రూల్.
కానీ, ఆ రూల్‌ని అతిక్రమిస్తూ, ఇసుక వేస్తున్న ఇంటి సభ్యుల్ని అలీ అడ్డుకున్నాడు. దాంతో సంచాలకునిగా వ్యవహరించిన వరుణ్, అది తప్పని అలీని నిలువరించాడు. కానీ అలీ వినకుండా, వాగ్వాదానికి దిగాడు. ఇదే విషయమై పునర్నవి కూడా అలీతో వాగ్వాదానికి దిగింది. కానీ, అలీ తనదైన శైలిలో పెద్ద మౌత్ వేసుకుని విరుచుకుపడ్డాడు. ఇలా అయితే, నేను ఆడను.. అంటూ పక్కకి వెళ్లిపోయాడు. టాస్క్ అనంతరం తన తప్పు లేకున్నా అలీకి, పునర్నవి సారీ చెప్పింది. నీ సారీ నాకేం అవసరం లేదు.. అని ఛీదరించుకున్నాడు అలీ. అలా అలీకి, పునర్నవికి మధ్య చిచ్చు రేగింది.